Earn Money (బ్లాగు ద్వారా సంపాదన)

బ్లాగ్‌ ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు. ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? దానికి కొన్ని టిప్స్‌ ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం…
కొన్ని అంశాలను పాటిస్తే బ్లాగ్‌ ద్వారా ఆదాయాన్ని సంపాదించవచ్చు. అవే ట్రాఫిక్‌ డ్రైవ్‌, ఇ-మెయిల్‌ లిస్ట్‌, ఎంగేజ్‌ రీడర్స్‌, వాట్‌ టు సెల్‌, మోనిటైజేషన్‌ ప్లాన్‌, గోల్‌, ప్రొఫిటబుల్‌ నిచ్‌. ఈ ఏడు స్టెప్స్‌ ద్వారా డబ్బును సంపాదించవచ్చు. వినియోగదారులను ఆకర్షించడం ఇందులో చాలా ముఖ్యమైంది. బ్లాగ్‌ ద్వారా బిజినెస్‌ చేయాలనుకుంటే లాభాపేక్ష రంగం ఏదనే దానిపై దృష్టిసారించాలి. ఆరోగ్యం, వెల్త్‌, కూపన్స్‌, సెల్ఫ్‌హెల్ప్‌ వంటివి బెస్ట్‌ ప్రోవిటబుల్‌ మార్కెట్లు. ఇందులో సక్సెస్‌ కావాలంటే కస్టమర్లతో స్మార్ట్‌గా వ్యవహరించాలి. బ్లాగు ద్వారా మార్కెట్‌ సృష్టించుకోవాలి.

బ్లాగ్‌ ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందాలనుకుంటున్నారన్న దానిపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఏదో కొంత డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారా లేదా పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించేలా బ్లాగ్‌ ద్వారా బిజినెస్‌ చేయాలనుకుంటున్నారా అనే విషయాల్ని తేల్చుకోవాలి. చిన్న పనులు చేసి ఒక బ్లాగు ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు లేదా నాలుగైదు బ్లాగుల ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. కొందరు తమ బ్లాగుల్లో నాణ్యమైన సమాచారాన్ని, అవసరమైన ఉత్పత్తుల గురించి తెలియజేస్తారు.

కస్టమర్లకు బ్లాగులో ప్రకటనల స్పేస్‌ను అమ్మొచ్చు. ఉత్పత్తులను అమ్మొచ్చు. అఫిలియేట్‌ ప్రోగ్రామ్స్‌ను ప్రమోట్‌ చేయొచ్చు. బ్లాగుకు డబ్బు సంపాదించి పెట్టే ప్లాన్స్‌ను ఆలోచించాలి. కొంతమందికి డజన్ల సంఖ్యలో బ్లాగ్స్‌ ఉంటాయి. వీటికి ప్రధాన వనరు మాత్రం గూగుల్‌ యాడ్‌ సెన్స్‌. యాడ్‌ సెన్స్‌ ద్వారానే 80 శాతం మేర ఆదాయం వస్తుంది. ఇలాంటి వెబ్‌సైట్ల విజిటర్లను కూడా కస్టమర్లుగా చూడాలి. ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని ఈ-మెయిల్స్‌ ద్వారా కస్టమర్లకు తెలియజేయాలి.

సొంత ఉత్పత్తులను లేదా అనుసంధాన ఉత్పత్తులను అమ్మాలంటే పక్కా ప్లానింగ్‌ ఉండాలి. ఉదాహరణకు సాఫ్ట్‌వేర్‌, ఇన్ఫర్మేషన్‌ ప్రాడెక్ట్స్‌ను ఇంటర్‌నెట్‌ మార్కెటింగ్‌ ద్వారా అమ్మొచ్చు. మొత్తం మీద కస్టమర్లకు అందించే సేవల మీద స్పష్టమైన దృక్కోణం ఉండాలి. కొత్త ప్రొడెక్టులు గురించి పాఠకులకు ఎప్పటికప్పుడు తెలియచేయాలి.

రీడర్స్‌కు ఎప్పటికప్పుడు కొత్త సమాచారం ఇవ్వడం వల్ల బ్లాగు శక్తివంతంగా పనిచేస్తుంది. విజిటర్లకు అందజేసే సమాచారం, కంటెంట్లను చక్కగా ప్లాన్‌ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు బ్లాగును అప్‌డేట్‌ చేస్తుండాలి. సోషల్‌ మీడియా ద్వారా పాఠకులతో నిత్యం టచ్‌లో ఉండొచ్చు. సోషల్‌ మీడియా ద్వారా వివిధ నెట్‌వర్కులను చేరొచ్చు. రకరకాల పాఠకులకు దగ్గరయ్యే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు ఇ-మెయిల్‌ లిస్ట్‌ను అప్‌డేట్‌ చేస్తుండాలి. రకరకాలుగా బ్లాగ్‌ ప్రమోషన్‌ను చేపట్టాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*