SEO Tutorial in Telugu

SEO Tutorial in Telugu Part-1

ఇప్పటివరకూ ఈ బ్లాగులో మీరు SEO గురించి తెలుసుకుంటున్న విషయాలు మీకు నచాయి అని ఆశిస్తున్నాను. బ్లాగు ఇప్పటికే తయారుచేసికొని దాని నిర్మాణంపై అవగాహన ఏర్పడిందని ఆశిస్తున్నాను. ఈ బ్లాగులో చెప్పే విషయాలు ఇప్పటికే బ్లాగింగ్ చేస్తున్నవారు, బ్లాగ్ తయారీపై అవగాహన ఉన్నవారికి అర్ధం అవుతాయి . బ్లాగుగానీ వెబ్సైటు గానీ ఇప్పటికే మీకు ఉంటె మీరు ముందుకు వెళ్ళవచ్చు. లేక పోయినా క్రింది విషయాలు మీ అవగాహనకు ఉపయోగించవచ్చు. సరే! అసలు విషయానికి వద్దాం…మీరు ఏదైనా వెబ్ సైట్ ఫైర్ ఫాక్స్ లో తెరవండి. ఇప్పడు మౌస్ తో రైట్ క్లిక్ చేసినప్పుడు view page source ఆప్షన్ కనపడుతుంది ప్రక్క పటంలో లాగ. దానిని క్లిక్ చేయండి .ఇప్పుడు ఆ సైట్ కు సంబంధించిన html source ఓపెన్ అయింది కదా . దాన్ని గమనించండి మీకు కొన్ని tags కనపడుతాయి. ఇదే రోబోట్ స్పిదర్ లు చదివే బాష అని తెలుసుకున్నాం కదా ఇక్కడ

<!DOCTYPE html>

<head>
<title></title>

. . .
.
. .
.
</head>
<body>
</body>
</html>

పైన తెలుపబడి tags కామన్ గా ఉంటాయి . వాటిలో <body></body> tags మధ్య ఉండేది ఆ వెబ్ సైట్ యొక్క కంటెంట్ ( విషయం ) .

<head></head> మధ్య ఉండే టాగ్స్ పై మనం దృష్టి పెడదాం
<title>SEO Optimized Metatags</title> అని ఉంది కదా దీన్ని టైటిల్ టాగ్ అంటారు.
రెండవ చిత్రంలో సెర్చ్ రిజల్ట్ లో మొదటి లైనుగా కనపడుతున్నది ఇదే .
ఇప్పుడు మీకు అర్ధం అయిందా టైటిల్ ట్యాగ్ యొక్క ఉద్దేశ్యం ! ఇక
<meta name=”Description” content=”SEO Optimized Metatags – A simple
tutorial on Search Engine
Optimization (SEO ) to learn what is SEO and various SEO tools
and techniques including White Hat Black Hat Spamdexing and Meta
tags Keywords Anchor Title
Hyperlink Images Web Page optimization and Search Engine
Crawling Indexing Processing Relevancy Calculation Result Retrieval Cloaking
Meta Tag Stuffing Doorway Gateway Page Hijacking” />

లో ఉన్నది description ట్యాగ్ . ఇది అ వెబ్ సైట్ యొక్క ముఖ్య ఉద్యేశ్యం, దానిలో ఏమి
ఉంటాయి అనే విషయాలు తెలుపు తుంది

సెర్చ్ రిజల్ట్స్ లో రెండవ లైనుగా ఉన్నది ఇదే !

ఇవికాక keywords tag అని ఉంటుంది. ప్రస్తుతం గూగుల్ దీనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
కానీ కొన్ని సెర్చ్ ఇంజన్లు దీన్ని కూడా
ఒక వెబ్ సైట్ ను ఆయా విభాగంలో చేర్చడానికి వినియొగిస్తున్నాయి keywords tag లో అ వెబ్ సైట్
లో ఎక్కువగా కనిపించే పదాలు
ఉంటాయి
ఉదా :
<meta name=”keywords” content=”andhranews, com, pradesh,
discussions, andhra”/>

మరిన్ని మెటా టాగ్స్ గురించి మరో పాఠంలో తెలుసుకుందాం .

SEO Tutorial in Telugu Part-2
సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ SEO ( పాఠం-2 )
దాదాపు కొన్ని వేల పేజీలలో వచ్చే రిజల్ట్స్ కన్నా మొదటి పేజిలో వచ్చే రిజల్ట్స్ కే వీక్షకుడు ప్రాధాన్యత ఇస్తాడు. అదీ మొదటి resultకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అలా మన బ్లాగు గానీ , వెబ్సైట్ గానీ మొదటి పేజి లో , మొదటి ర్యాంక్ గా వచ్చేలా చేసేదే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ( SEO)
మీ బ్లాగు అలా రావాలంటే ఏమి చేయాలో నేర్పడానికే ఈ బ్లాగ్ .
సరే మరి ఈ సెర్చ్ ఇంజిన్స్ ర్యాంకింగ్ ఎలా చేస్తాయి?
అవి మన బ్లాగును ఎలా గుర్తిస్తాయి?
మన బ్లాగును ర్యాంక్ చేయాలంటే ఏమిచేయాలి ?
ఈ విషయాలన్నీ క్రొద్ది వారాల్లోనే వివిధ టపాలుగా వ్రాస్తాను.
ఈ రోజుకి క్రింది వీడియో చూడండి

SEO Tutorial in Telugu-Increase alexa rank blogpot blogger
మీ బ్లాగు అలెక్షా ర్యాంక్ ఈజీగా పెరిగే టెక్నిక్
నేను చెప్పబోయే టెక్నిక్ కేవలం బ్లాగ్ స్పాట్ బ్లాగులకు మాత్రమె .
ఎవరైనా మీ బ్లాగు యొక్క అడ్రెస్స్ చెప్పమని అంటే ఏమి చెబుతారు ? ఫలానా xyz.blogspot.com అనా ? లేక xyz.blogspot.in అనా ? చాలామంది మొదటిదే చెబుతారు. ఇంతకీ ఏమిటి ఈ తేడా ?
గూగుల్ తన blogspot బ్లాగుల యొక్క సబ్ దొమైన్స్ ను ఏ దేశం నుండి వీక్షిస్తే ఆయా దేశాల డొమైన్ ఎక్స్ టెన్షన్ పేర్లకు మారెలా మార్పు చేసింది. ఈ మార్పును దాదాపు 15 దేశాలకు ఆయా దేశాల డొమైన్ ఎక్స్ టెన్షన్ లకు మరెలా చెసిన్ది. ఉదాహరణకు అమెరికా నుడి వచ్చే వీక్షకులు తమ దేశంలో .com ఎక్స్ టెన్షన్ తోనూ, ఇండియా వీక్షకులు .ఇన్ తోనూ ఆస్ట్రేలియా వీక్షకులు .co.uk ఎక్స్ టెన్షన్ తోనూ మీ బ్లాగును వీక్షిస్తారు. ప్రస్తుతం ఉన్న ఎక్స్ టెన్షనలు :
India [blogspot.in], Australia [blogspot.com.au], UK [blogspot.co.uk], Japan [blogspot.jp], New Zealand [blogspot.co.nz], Canada [blogspot.ca], Germany [blogspot.de], Italy [blogspot.it], France [blogspot.fr], Sweden [blogspot.se], Spain [blogspot.com.es], Portugal [blogspot.pt], Brazil [blogspot.com.br], Argentina [blogspot.com.ar], Mexico [blogspot.mx] గూగుల్ చేసిన ఈ మార్పువల్ల అలెక్సా ర్యాంక్ ఆయా దేశాలకు వేరు వేరు గా ఉంటోంది ఇండియా నుంచి వచ్చే వీక్షకులు ఎక్కువగా ఉంటె ఇండియా ర్యాంక్ ఎక్కువగా ఉంటోంది. సాధారణంగా తెలుగు బ్లాగులకు ఇండియా వీక్షకులే ఎక్కువ కనుక .in తోనే మంచి ర్యాంక్ ఉంటుంది.
ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ అన్నిరకాల సబ్ దొమైన్స్ ను .com కు తీసుకుని వెళ్తాయి ( Redirect ). కనుక
మీ బ్లాగు క్రొత్తది అయితే ఈ టెక్నిక్ ఉపయోగించవచ్చు ఒకవేళ మీ బ్లాగు చాలా పాతది అయితే ఇప్పటికే బ్లాగు ర్యాంక్ మంచి పొజిషన్ లో ఉంది ఉండొచ్చు. కనుక నేను చెప్పబోయేది జాగ్రత్తగా ర్యాంక్ లను చెక్ చేసికొని చెయ్యండి. క్రింది లింక్ ద్వారా మీ బ్లాగు ర్యాంక్ .in పెట్టి ఒకసారి .com పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ రెండు ర్యాంక్ లకూ తేడా తక్కువగా ఉంటె ఉదా: .in కు 30 లక్షలు , .com కు 50 లక్షలు ఉంటె పరవాలేదు అలాకాక .com కొట్లలో ఉంటె ఈ మార్పు చెయ్యక పోవడమే బెటర్ .
ముందుగా మీ బ్లాగుయొక్క అలెక్షా ర్యాంక్ చెక్ చేసుకోండి.
మీకు ఇప్పటికీ ఈ మార్పు చెయ్యాలి అనిపిస్తే క్రింద చెప్పింది ఫాలో కండి .
ఈ మార్పు మీబ్లాగును xyz blogspot .com గా ప్రతీ దేశంలోనూ చూపేందుకు
హెచ్చరికలు : ఏదైనా దేశంలో blogspot .com ను నిషేదిస్తే ఆ దేశంలో మీ బ్లాగు కనపడదు .
మీ బ్లాగు ఇప్పటికే గూగుల్ సెర్చ్ లో ఇండెక్స్ అయి ఉన్నా, గూగుల్ + , ఫేస్బుక్ లైకులు ఉన్నా అవి ఈ మార్పువల్ల ఎఫెక్ట్ అవుతాయి .
ఇప్పటికే మీ బ్లాగుకు గూగుల్ పేజి ర్యాంక్ ఉంటె అది కూడా ఎఫెక్ట్ అవుతుంది.
ముందుగా మీ బ్లాగర్ డాష్బోర్డ్ (dashboard ) లో EDIT HTML ఆప్షన్ లోకి వెళ్ళండి దానిలో <head > టాగ్ గురించి వెతకండి. దానికి వెంటనే క్రింది కోడ్ కలుపండి .
<script type=”text/javascript”>
var blog = document.location.hostname;
var slug = document.location.pathname;
var ctld = blog.substr(blog.lastIndexOf(“.”));
if (ctld != “.com”) {
var ncr = “http://” + blog.substr(0, blog.indexOf(“.”));
ncr += “.blogspot.com/ncr” + slug;
window.location.replace(ncr);
}
</script>

ఇప్పుడు సేవ్ ( SAVE ) క్లిక్ చేయండి . అంటే ఇక నుండి మీ బ్లాగు .com కు మాత్రమే వెళ్తుంది దీని వల్ల మీ బ్లాగు అలెక్సా ర్యాంక్ ముందుకన్నా వేగంగా పెరిగుతుంది .
మరో టిప్ తో మళ్ళీ కలుద్దాం .

SEO Tutorial in Telugu-How search engine works
సెర్చ్ ఇంజన్లు ఎలా సమాచారాన్ని సేకరిస్తాయి ?

ఇంటర్నెట్ విస్తృతి పెరిగేకొద్దీ సెర్చ్ ఇంజన్లపై ఆధారపడడం ఎక్కువవుతుంది. సెర్చ్ ఇంజన్ మనకు రిజల్ట్ ఇవ్వాలంటే ముందు అవి ఆయాపేజీలను ఇప్పటికే గుర్తించి ఉండాలి కదా. . ఇన్ని వేల పేజీల పలితాలను ఇస్తున్న సెర్చ్ ఇంజిన్ తాను అన్ని కోట్ల పేజీలను ఎలా దాచుకోగలుగుతుంది ? ప్రజీ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ రోబోట్స్ ( robots ) అని పిలువబడే ప్రత్యెక సాఫ్ట్వేర్ ఉపయొగిస్తాయి. వీటినే spiders అంటారు. spider అంటే సాలెపురుగు . web ( సాలెగూడు ) ను అల్లుకుపోతుంది ఇది. వెబ్ లో ప్రతీమూలా వెతుకుతూ keywords ను తయారు చేయడమో, లేక ఇప్పటికే అది తయారు చేసిన వాటికి క్రొత్త విషయాల్ని జొదించడమో చెస్తాయి. దీన్ని వెబ్ క్రౌలింగ్ అంటారు . ఈ spiders ముందుగా ఎక్కువగా ఉపయోగించే సర్వర్లను , ముఖ్యమైన పేజీలతో తమ ప్రయాణాన్ని మొదలెడతాయి. ఈ ప్రయాణంలో తారసపడే ప్రతీ క్రొత్త పదాన్నీ , క్రోత్త లింక్ నూ తనలో దాచుకుంటుంది . అసలు ఈ spiders వెబ్ పేజిలను ఎలా చదువుతాయి? వాటికి అన్ని బాషలు వచ్చా ? వచ్చే పాఠం లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*